వాటిపై విచారణ కి ఆదేశించే ధైర్యం జగన్ కి ఉందా?

Tuesday, September 15th, 2020, 09:48:11 PM IST

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చినరాజప్ప వైసీపీ ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రవర్తిస్తున్న తీరు పట్ల ప్రతి దాడికి దిగారు. వైసీపీ ప్రభుత్వం లో జరుగుతున్న దరునల నుండి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చదానికే ఈ రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని పాలకులు తెర పైకి తీసుకు వచ్చారు అంటూ విమర్శలు చేశారు. అయితే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన అనంతరం విశాఖ పట్టణం లో భూముల కొనుగోలు అంశం కూడా టీడీపీ నేతలు లేవనెత్తారు. మరొకసారి చినరాజప్ప ఈ విషయం పై కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖ పట్టణం లో ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన భూముల పై ఎందుకు విచారణ జరపడం లేదు అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ పై బురదజల్లే కార్యక్రమాలు తప్ప, వైసీపీ అధికారం లోకి వచ్చాక చేసింది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు. అయితే విశాఖపట్టణం లో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల వ్యవహారం పై విచారణ కి ఆదేశించే ధైర్యం జగన్ కి ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.