తప్పుడు కేసులు పెట్టే స్థాయికి సీఎం దిగజారారు – ధూళిపాళ్ల నరేంద్ర

Thursday, March 25th, 2021, 01:52:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి లో క్రయ విక్రయాల పై తప్పుడు కేసులు పెట్టారు అంటూ మండిపడ్డారు. అయితే అమరావతి లో రాజధాని ఉండటం ఇష్టం లేకనే ధైర్యంగా చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టే స్థాయికి సీఎం దిగజారారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అమరావతి రాజధాని ను తరలించేందుకు కుట్ర చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా వైసీపీ నేతలు, పోలీసులే ఇందులో పాత్రధారులు, సూత్రధారులు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెట్టిన కేసు పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆర్కే పెట్టిన సీఐడీ కేసులో అభూత కల్పనలు సృష్టించారు అని వ్యాఖ్యానించారు. అయితే ఆర్కే ఫిర్యాదు లో పేర్కొన్నట్లు గా ఎస్సీలు, బాధితులు ఎవరూ లేరు అని నరేంద్ర మీడియా సమావేశం లో అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.