పురపాలక ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేసిన టీడీపీ

Friday, February 26th, 2021, 11:52:32 AM IST

TDP_1706

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతి ఎన్నికలు ముగియడం తో పార్టీలు పురపాలక ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేసింది. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరీ లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పది అంశాల తో కూడిన మేనిఫెస్టో ను విడుదల చేసారు. పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు పేరిట మేనిఫెస్టో ను విడుదల చేసారు.అయితే ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.