కేంద్రాన్ని జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు – టీడీపీ

Tuesday, March 9th, 2021, 03:38:55 PM IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. విశాఖ ఉక్కు ను అమ్మేసేందుకు ఇప్పటికే జగన్ రెడ్డి ప్రభుత్వం తోసంప్రదింపులు జరిపామని కేంద్రం చెబుతున్న దాన్ని బట్టి జగన్ రెడ్డి విశాఖ ఉక్కు ఆస్తులను కాజేసెందుకు కుట్ర పన్నిన మాట వాస్తవమే అన్నమాట అంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలుగు దేశం పార్టీ వెల్లడించింది. లేదంటే అమ్మేసఅంటున్న కేంద్రాన్ని జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తెలుగు దేశం పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న నిరసనలను వీడియో రూపం లో పోస్ట్ చేయడం జరిగింది. అధికార పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వరుస విమర్శలు గుప్పిస్తుంది.