గ్రేటర్‌లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..!

Friday, November 20th, 2020, 02:21:04 AM IST

TDP_party

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పూర్తిగా పట్టు కోల్పోయిన టీడీపీ తిరిగి ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పుంజుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించిన టీడీపీ తాజాగా తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 90 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే తొలి జాబితాలో 90 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌లు ప్రచారం చేశారు. అయితే ఈ సారి పార్టీ తరపున ప్రచారం చేసేందుకు వీరు వస్తారా లేక లోకల్ లీడర్లతోనే ప్రచారం ముగించేస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.