వీడియో పెట్టి మరీ వైసీపీ గుట్టు రట్టు చేసిన టీడీపీ.!

Sunday, April 5th, 2020, 12:47:18 PM IST

తాజాగా ఆంధ్ర రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ తమ వాలంటీర్ల ద్వారా తెల్ల రేషన్ కార్డు దారులు అందరికీ 1000 రూపాయలను అందజేస్తున్నారు. అయితే ఈ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా జరగడం లేదని చెప్పాలి. నిన్నటి నుంచి ఇతర పార్టీల అభిమానులు మరియు కార్యకర్తలు వైసీపీ అభిమానులతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో జరగని వాగ్వాదం లేదు.

అయితే కరోనా సహాయార్ధం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను వైసీపీ అభిమానులు మరియు కార్యకర్తలు ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం అని వాటిని వచ్చే ఎన్నికల్లో ఓటుకు నోటుగా పంచడం మొదలు పెట్టేసారు. అయితే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు తెలిసి జరుగుతుందో తెలీకుండా జరుగుతుందో ఏమో కానీ ఈ పంపిణీ మాత్రం పెద్ద సంచలనమే రేపింది.

ఈ డబ్బులు ఇస్తూ ఓటు వెయ్యమని చెప్తున్నా ఓ మహిళా వీడియోను పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ద్వారా ప్రచారం చేసి వైసీపీ చేస్తున్న ఈ రాజకీయాలను తిప్పి కొట్టారు.”ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు అడిగాడు అంట…కరోనా తో ఇక్కడ ప్రాణాలు పోతుంటే… వీళ్లు ఓట్లు అడుక్కుంటున్నారు.. వీళ్ళకి ప్రజలకన్నా ఓట్లు పదవులే ముఖ్యం” అంటూ ఆ వీడియోను పెట్టారు. ఓసారి చూడండి.