జగన్ పాలనపై ఎంపీ రామ్మోహన్ నాయుడు అల్టీమేట్ రైమ్..!

Saturday, February 6th, 2021, 02:02:20 PM IST

ఏపీ సీఎం జగన్ పాలనపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రౌడీయిజం, అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించడమే కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఓ అల్టీమేట్ రైమ్ ను ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఏపీకి రావల్సిన ప్రత్యేక హోదా, వైసీపీ అవినీతి పాలన, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేలేకపోవడం, రౌడీ రాజ్యం, రైల్వే జోన్, అక్రమ కేసులు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై వంటి అంశాలను ప్రస్తావిస్తూ పేరడీ చేశారు. అంతేకాదు అసలు ఏపీ భవిష్యత్తు ఏంటో అని ప్రశ్నార్ధకాన్ని సూచించారు. ఇదిలా ఉంటే ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రకటన రావడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని రామ్మోహన్ నాయుడు అన్నారు.