పార్లమెంట్ లో కూడా ఏపీ పరువు తీసే విధంగా మాట్లాడుతున్నారు – టీడీపీ ఎంపీ

Thursday, September 17th, 2020, 04:33:03 PM IST

2019 ఎన్నికల్లో టీడీపీ ను చిత్తు చిత్తుగా ఓడించి, వైసీపీ భారీ మెజారిటీ తో రాష్ట్రం లో అధికారం లోకి వచ్చింది. పార్లమెంట్ స్థానాల్లో కూడా 22 సీట్లు సొంతం చేసుకొని వైసీపీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. అయితే అధికారం లోకి రావడం మాత్రమే కాకుండా, ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అని తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. వైసీపీ ఎంపీ ల తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మమల్ని గెలిపించండి ఏపీ కి ప్రత్యేక హోదా తెస్తామని ఢిల్లీ లో చెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఇంతమంది ఎంపీ లను పెట్టుకొని హోదా సంగతి మాట్లాడరు ఎందుకని అంటూ సూటిగా ప్రశ్నించారు. హోదా సంగతి వదిలేసి పార్లమెంట్ లో కూడా చంద్రబాబు గారి పేరునే కలవరించడం ఎంటి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే వైసీపీ కి చెందిన ఎంపీ ల తీరు పార్లమెంట్ లో కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పరువు తీసే విధంగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా లో వీడియో ద్వారా తెలిపింది.