సీఎం జగన్ రైతు ద్రోహి.. ఎంపీ కేశినేని కీలక వ్యాఖ్యలు..!

Monday, December 28th, 2020, 12:00:47 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యమని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలకు రక్షణ కల్పిచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇక రైతు సమస్యలను కూడా ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు.

అయితే అమరావతి రాజధానిగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని, మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలని సూచించారు. గుప్పెడు మట్టితో రోడ్డు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారంటే నమ్మేందుకు ఎవరూ సిద్దంగా లేరని అన్నారు. తన చేతకానితనాన్ని ఒప్పుకోలేక మూడు రాజధానులంటూ డ్రామాలాడుతున్నారని కేశినేని నాని అన్నారు.