2024లో టీడీపీ అధికారంలోకి రావాలి.. టీడీపీ ఎంపీ కేశినేని ట్వీట్..!

Thursday, August 6th, 2020, 04:59:22 PM IST

Kesineni_Nani

టీడీపీ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మన కలలు మనమే సాకారం చేసుకోవాలని, మన కలలు ఎదుటివారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకమని అన్నారు.

అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల అది సాకారం అవ్వాలంటే 2024 లో టీడీపీ అధికారంలోకి రావాలని, ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలని అన్నారు. అంతేకాదు మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.