సీఎం జగన్‌కు తట్టుకునే శక్తి ఉందా.. కేశినేని నాని కుమార్తె హెచ్చరిక..!

Wednesday, December 16th, 2020, 03:00:44 AM IST

YS_Jagan

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏడాదిగా రాజధాని అమరావతి కోసం మహిళలు, రైతులు ఉద్యమిస్తున్నారని అన్నారు. రాజధాని కోసం పోరాడుతున్న రైతుల శిబిరాల ముందు నుంచే సీఎం జగన్ సచివాలయానికి వెళ్తున్నారని కానీ ఒక్కరోజు కూడా అమరావతి రైతులతో మాట్లాడలేదని ఆరోపించారు.

అయితే జగన్ మూర్కత్వంతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అంటున్నారని, ఇప్పటివరకు ప్రజలకు సీఎం జగన్ గుప్పెడు ఇసుక కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి వైఫల్యాలకు మారు పేరుగా నిలుస్తున్నారని అన్నారు. రాజధాని కోసం విజయవాడ యువకులు సైన్యంగా ముందుకు వచ్చారని, ఈ సైన్యం సునామీగా మారితే జగన్‌కు తట్టుకునే శక్తి ఉందా అని హెచ్చరించారు.