పార్లమెంట్ లో జరిగే చర్చను రాజకీయం చేయాలన్నదే విజయసాయి రెడ్డి లక్ష్యం!

Thursday, September 17th, 2020, 08:28:37 PM IST


పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తీరు పై, చేస్తున్న వ్యాఖ్యల పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు, ఎంపీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి అసంబద్ధమైన అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించారు అంటూ ఆరోపణలు చేశారు.

ఉన్నత న్యాయస్థానాల పై అభాండాలు వేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. న్యాయస్థానాలు ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించవూ అని రవీంద్ర కుమార్ అన్నారు. పార్లమెంట్ లో జరిగే చర్చను రాజకీయం చేయాలనేదే విజయసాయి రెడ్డి లక్ష్యం అని ఆరోపణలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలకు కోర్టుల్లో మొట్టికాయలు పడుతున్నాయి అని, వైసీపీ పై వచ్చే ఆరోపణలను తప్పుదారి పట్టించేందుకు మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ఎత్తుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.