ప్రత్యేక హోదా అంటే వైసీపీ భయపడి పారిపోయే పరిస్థతి ఎందుకు వచ్చింది

Wednesday, October 7th, 2020, 05:54:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాట్ విమర్శలు చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం లో పేర్కొన్న విషయాలు ఎంతవరకు వచ్చాయో వివరించాలి అని జగన్ ను డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని అడిగారా అంటూ నిలదీశారు. ఢిల్లీ పర్యటన లో ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదు అని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం అడుగుతూనే ఉండాలి అని ప్రజలు వైసీపీ కి ఓటు వేయలేదు అని, సాధించేందుకు ఓటు వేశారని గుర్తు చేశారు.

ఢిల్లీ వెళ్లి పెద్దలతో చర్చించిన విషయాలు ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు, వ్యక్తి గత ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంట్ ఆవరణ ఎల్ ఒక్కరోజు అయినా పోరాటం చేశారా అని ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలదీశారు. పార్లమెంట్ లో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఎంపీలు అడిగితే కేంద్రం సమాధానం చెప్పదా అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం పై ఎందుకు ఒత్తిడి తేలేక పోతున్నారు అని, సీఎం జగన్ బాధ్యత తీసుకొని ఇవన్నీ అడగక పోతే రాష్ట్రానికి ఎలా న్యాయం జరుగుతుంది సమాధానం చెప్పాలి అంటూ నిలదీశారు. అయితే ప్రత్యేక హోదా అంటే వైసీపీ భయపడి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో జగన్ సమాధానం చెప్పాలి అని అన్నారు.