పార్లమెంట్ లో వైసీపీ తీరును ఎండగట్టిన టీడీపీ ఎంపీ

Monday, March 22nd, 2021, 01:54:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ళ నిర్మాణం లో తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నాది అని, ఈ విషయం లో కేంద్రం కలుగజేసుకొని పేదలకు ఇళ్లు అందేలా చూడాలని తెలుగు దేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పార్లమెంట్ లో కేంద్రాన్ని కోరారు అంటూ తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా వేదిక గా చెప్పుకొచ్చింది. అయితే.కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేయకుండా పేదలకు నిలువనీడ లేని పరిస్తితి తెచ్చింది అని, ఇప్పటికే మంజూరు అయిన పేదల ఇళ్లను కూడా రద్దు చేసింది అని, తెలుగు దేశం పార్టీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ కేంద్రం దృష్టికి తీసుకు వచ్చారు అని టీడీపీ తెలిపింది.

అయితే ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ చేసిన వ్యాఖ్యలకి సంబందించిన ఒక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే వైసీపీ తీరును పార్లమెంట్ సాక్షిగా ఎండగడుతూ టీడీపీ ఎంపీ లు చేస్తున్న వ్యాఖ్యల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక లో సైతం టీడీపీ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడం కోసం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.