వాటిని ఎదుర్కోవడం లో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ వస్తోంది – టీడీపీ ఎంపీ

Tuesday, October 20th, 2020, 09:17:17 AM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టపు చూపుగా వస్తున్నారు అంటూ టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పై, ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు కష్టాల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, వారి బాధలు కళ్ళారా చూసి ఓడార్చేవాడే నాయకుడు అంటూ నారా లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. మరో పక్క తమ అధికార హోదా సౌకర్యాలను విడవకుండా ఇలా చుట్టపు చూపు చూస్తూ పోవడాన్ని జనం మర్చిపోరు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఇలా ఉండబట్టే ఇప్పుడున్న వరదలు, వానలను ఎదుర్కోవడం లో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది అని అన్నారు. దీనికి తోడుగా ముఖ్యమంత్రి ఎక్కడా అంటూ ఒక ట్యాగ్ ను జత చేశారు. అయితే ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యల పై నెటిజన్లు వరుస విమర్శలు చేస్తున్నారు. ప్రతి పక్ష పార్టీ నాయకుడు ఎక్కడా అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి కొందరు మాత్రం వైసీపీ తీరును తప్పుబడుతున్నారు.