సీఎం జగన్‌కు ప్రివిలేజ్ నోటీసులు.. టీడీపీ ఎమ్మెల్సీ హెచ్చరిక..!

Thursday, February 13th, 2020, 07:26:53 PM IST

ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టికల్ 169 ప్రకారం ఏర్పడిన మండలి గురుంచి, అందులోని సభ్యుల గురుంచి, సభకు అధ్యక్షత వహించే స్పీకర్ గురుంచి సీఎం జగన్ చులకనగా మాట్లాడారని మండలి సమావేశం ఏర్పాటు చేస్తే జగన్‌పై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇవ్వడానికి నిర్ణయించామని తెలిపారు.

అయితే మండలికి వచ్చిన సభ్యులంతా దొడ్డి దారిన వచ్చారంటూ ముఖ్యమంత్రి అనడం సిగ్గుచేటు అని అన్నారు. పట్టభద్రులు, స్థానికసంస్థల సభ్యుల ద్వారా, గవర్నర్‌, ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకున్న వారంతా అసమర్ధులు అని అసెంబ్లీలో చిత్రీకరించాలని ప్రయత్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేవరకు మండలి కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.