ప్రభుత్వం వారిని టార్గెట్ చేసింది.. వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలు..!

Friday, August 21st, 2020, 12:13:05 AM IST

TDP_1706
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కీలక ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసిందని అన్నారు. కమ్మ కులంలో పుట్టిన వారిని టార్గెట్ చేయడం సరికాదని, కమ్మ కులంలో పుట్టాలని మేము దేవుడిని కోరుకున్నామా అని ప్రశ్నించారు.

అంతేకాదు ఇటీవల విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్ ఘటన విచారణ జరుగుతున్న తీరు సరిగ్గా లేదని అన్నారు. రమేశ్ ఆసుపత్రిదే పూర్తి బాధ్యత అని చెబుతూ మహిళలు అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ జరుపుతున్నారని అన్నారు. ఇది పక్కన పెడితే వైయస్ వివేకా హత్య కేసు అంశంలో ఏం తేల్చిందని ఇంతవరకు దోషులను పట్టుకోకపోవడం బాధాకరమని అన్నారు. రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో పది పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న జగన్ సర్కార్ వివేకా హత్య కేసులో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు.