టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత

Wednesday, October 28th, 2020, 04:00:41 PM IST

తెలుగు దేశం పార్టీ కి ప్రస్తుతం కష్ట కాలం నడుస్తుంది అని చెప్పాలి. పార్టీ లోని కీలక నేతలు రాజీనామా లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామాలు చేయగా, మరొక కీలక నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. తన రాజీనామా ను శాసన మండలి చైర్మన్ కి పంపడం జరిగింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీత తెలిపారు. అయితే తెలుగు దేశం పార్టీ గత కొద్దీ రోజులుగా అభివృద్ధికి అడ్డుపడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీఎం జగన్ పాలన పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ అడ్డుకుంతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.