ఏపీ లో పేదవాడికి న్యాయం జరిగే పరిస్థితి లేదు – టీడీపీ నేత

Sunday, September 6th, 2020, 07:01:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న ఘటన ల పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. తనను అక్రమం గా నిర్బధించారు అని, అలా నిర్బధించేందుకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అంటూ తప్పుడు పత్రాలను చూపిస్తూ కుట్ర పన్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రాష్ట్రం లో తప్పుడు కేసులు పెట్టిన వేధిస్తున్న ఘటనల పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి అంటూ దీపక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్ లో యువకుడికి శిరోముండనం చేయడం లాంటి ఘటన ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్ లో నే అలా చేశారు అంటే వ్యవస్థలను ఎలా కుప్ప కుల్చారో అర్దం చేసుకోవచ్చు అని అన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పేదవాడికి న్యాయం జరిగే పరిస్థితి లేదు అని తేల్చి చెప్పారు. అంతేకాక పోలీస్ వాహనాలను వినియోగించి కిడ్నాప్ లు జరగడం దారుణం అని అన్నారు. అయితే పేదలకు ఇబ్బందులు ఎదురైన సమయం లో ప్రైవేట్ కేసులు పెట్టి న్యాయం జరిగేలా చూడాలని తెలుగు దేశం పార్టీ తరపున దీపక్ రెడ్డి కోరడం జరిగింది. అయితే ఇప్పటికే టీడీపీ నేతల పై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు, ఈ వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తారో చూడాలి.