టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా పాజిటివ్..!

Friday, August 28th, 2020, 01:14:33 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని. 14 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని విన్నవించారు. నాకు దైవ సమానులైన మా అధినేత చంద్రబాబు గారు, అభిమానుల ఆశీస్సులతో కరోనాను జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు.