వైసీపీకి అల్టీమేట్ సవాల్ విసిరిన బుద్ధా వెంకన్న.. సిద్దమేనా..!

Tuesday, March 2nd, 2021, 03:26:43 PM IST

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అధికార వైసీపీకి అల్టీమేట్ సవాల్ విసిరారు. నిన్న రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడం సీఎం జగన్ పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, చంద్రబాబే తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడన్న భయం జగన్‌లో మొదలయ్యిందని చెప్పుకొచ్చారు.

అయితే జగన్‌కు నిజంగా ప్రజా బలముంటే తక్షణమే అసెంబ్లీనీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరించి గెలిపిస్తే కనుక తాము టీడీపీ పార్టీనీ మూసేస్తామని, ఒకవేళ ప్రజాబలంతో టీడీపీ కనుక విజయం సాధిస్తే, వైసీపీ దుకాణం కట్టేయడానికి జగన్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని సమయమొచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు.