రేవంత్ కు 14రోజులు రిమాండ్!

Monday, June 1st, 2015, 09:37:46 AM IST


తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేస్తూ పట్టుబడిన నేపధ్యంలో ఆయనను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ముందు సోమవారం హాజరుపరిచారు. ఇక ఈ మేరకు రేవంత్ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీని విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలను జారీ చేశారు. దీనితో రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు కూడా 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలను జారీ చేశారు.

ఇక నేడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో తమ క్లయింటు ఓటు వెయ్యాల్సి ఉందని, ఆయన ఓటేసేందుకు అనుమతించాలని రేవంత్ తరపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు. కాగా దీనిపై ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో న్యాయమూర్తి గనుక ఓటేసేందుకు అనుమతించకుంటే రేవంత్ తో పాటు మరో ఇద్దరినీ కూడా చెర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.