సీఎం జగన్ ను కలిసిన టిడిపి ఎమ్మెల్యే…కుమారులు వైసీపీ లో చేరిక!

Saturday, September 19th, 2020, 07:06:50 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తెలుగు దేశం పార్టీ బలం మెల్లమెల్లగా తగ్గుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యే లు పార్టీ ను వీడగా, చాలా మంది కీలక నేతలు వైసీపీ లోకి చేరారు. అయితే తాజాగా టీడీపీ నేత, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిశారు. అయితే ఎమ్మెల్యే కుటుంబం తో పాటుగా, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మరియు గన్నవరం నియోజక వర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. విశాఖ ను ఎక్జిక్యూటివ్ కాపిటల్ గా మద్దతు తెలుపుతున్నారు ఎమ్మెల్యే వాసుపల్లీ గణేష్. చంద్రబాబు పై కూడా నమ్మకం తగ్గడం ఒక కారణం అని చెప్పవచ్చు.

అయితే మిగతా ఎమ్మెల్యే లాగానే, వైసీపీ లో చేరకుండా, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి కి మద్దతు తెలుపుతున్నారు. అయితే కుమారులు ఇద్దరు కూడా వైసీపీ లో చేరడం కొసమెరుపు. మరి దీని పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.