ఢిల్లీకి పిలిపించి జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు.. గోరంట్ల హాట్ కామెంట్స్..!

Friday, September 25th, 2020, 11:39:44 AM IST

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని అన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా సీఎం జగన్‌ని ఢిల్లీకి పిలిపించి న్యాయవ్యవస్థపై దాడి అంశంపై సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు.

అయితే దేశంలో అవినీతి అక్రమార్కులపై, నేరారోపణలు ఉన్న 4,900 పైచిలుకు నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ అంశంపైనే న్యాయవ్యవస్థ సీరియస్‌గా ఉందని తెలిపారు. ఈ విషయంలో సీఎం జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు కంగారుపట్టుకున్నట్లు ఉందని, అందుకే ఆయన జగన్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. కేసులు మాఫీ చేయించుకునేందుకే వెళ్ళారని, లేదంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నారు.