పార్టీ మారే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే..!

Monday, June 1st, 2020, 08:26:25 PM IST


టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో స్పందించిన ఎమ్మెల్యే అనగాని తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

అయితే నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇప్పటికే రెండు సార్లు ఇలాంటి ప్రచారాలు జరిగాయని, ఇది మూడోసారి అని అన్నారు. అయితే కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేసే ప్రతి పోరాటంలో తాను అండగా ఉంటానని అన్నారు. పార్టీ మారమని ఎందరో అడుగుతారని, అంత మాత్రాన వెళ్లిపోయినట్లు కాదని స్పష్టం చేసారు. మొన్న జరగిన మహానాడులో తాను పాల్గొన్నానని, మంత్రి బాలినేనిని కలిసినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.