బిగ్ న్యూస్: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా..!

Saturday, February 6th, 2021, 03:40:12 PM IST

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. అయితే ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ అని తన ప్రజలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోనని గంటా శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తాను మాటల మనిషిని కాదని చేతల మనిషినని స్పష్టం చేస్తూ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భ్మగా గంటా శ్రీనివాస్ ప్రకటించారు.