తాటాకు చప్పుళ్లకు భయపడను – టీడీపీ ఎమ్మెల్యే

Sunday, December 27th, 2020, 01:30:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి, మరియు ప్రతి పక్ష పార్టీ టీడీపీ కి మద్యలో వరుస విమర్శలు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అధికార పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలకు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గట్టి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ ఆక్రమణలకు పాల్పడినట్లు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే అలా చేయలేదు అని, ప్రమాణం చేయడానికి సిద్దం అని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు. అయితే విజయసాయి రెడ్డి కూడా చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే ఈ మేరకు వెలగపూడి రామకృష్ణ బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాటాకు చప్పుళ్లకు తను భయపడను అని, విజయసాయి రెడ్డి కి సవాలు విసిరితే మద్యలో వీరంతా ఎవరూ అంటూ వైసీపీ నేతలను కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను విజయసాయి రెడ్డి ని ప్రమాణం చేయమన్నాను అని, నిజాయితీ గా రాజకీయాలు చేస్తాను అని, సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని వైసీపీ నేతలు అంటున్నారు, అయితే ఆ సవాల్ స్వీకరిస్తున్నా అని, అక్కడ ప్రమాణం చేయడానికి విజయసాయి రెడ్డి వస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ ల మధ్య కొద్ది రోజులుగా ఈ సవాళ్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.