కరోనా చికిత్స లో కాదు, కరోనా వ్యాప్తి లో రాష్ట్రం ముందుంది

Friday, August 14th, 2020, 12:49:06 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికవరీ రేటు సైతం దేశం లో ఉన్న పరిస్థితులతో పోల్చితే తక్కువే. మరణాల్లో సైతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుంది. అయితే కరోనా వైరస్ చికిత్స లో రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుంది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలుపగా, అందుకు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే తనదైన శైలిలో బదులు ఇచ్చారు.

రాష్ట్రం కరోనా చికిత్స లో కాదు, కరోనా వ్యాప్తి కి ముందుంది అంటూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అంటూ టీడీపీ నేతలు గగ్గోలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ సైతం అందుకు తగ్గట్టు గా రాష్ట్రం లో కరోనా రోగుల పరిస్తితి ఎలా ఉంది అనే దాని పై సోషల్ మీడియా వేదిక గా పలు వీడియో లను సైతం పోస్ట్ చేస్తూ ఉంటుంది.