ఆ విషయంలో అవసరమైతే సీఎం జగన్‌ని కలుస్తా – బాలకృష్ణ

Monday, August 31st, 2020, 02:35:39 PM IST

Balakrishna

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. మొత్తం 25 లేదా 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఓ కమిటీనీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించనుంది.

అయితే హిందూపురం నియోజకవర్గాన్ని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. నేడు హిందూపురం ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ ఆసుపత్రికి 55 లక్షల రూపాయల విలువ చెసే వైద్య పరికరాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూపురం విషయంలో తాను ఎంత దూరమైన వెళతానని, అవసరమైతే సీఎం జగన్‌ను కూడా కలిసి కోరుతానని అన్నారు. ఇకపోతే రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపులు చర్యలే ఎక్కువయ్యాయని ఆరోపించారు.