టీడీపీ ఎమ్మెల్యే అచ్చేనాయుడు కి సోకిన కరోనా

Thursday, August 13th, 2020, 06:44:18 PM IST

acham-naidu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రజా ప్రతినిదులు సైతం ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన అచ్చెన్నాయుడు కి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ ఎస్ ఐ కుంభకోణం లో ఇప్పటికే పోలీసులు అచ్చెన్న ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే అచ్చెన్న కి అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా ఆసుపత్రి లోనే చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం తో టెస్టుల జరపగా, కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం గుంటూరు లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అచ్చెన్న తరపు న్యాయవాది వెల్లడించారు. ప్రస్తుతం అచ్చెన్న ఆరోగ్యం బాగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పది వేలకు చేరువలో గత వారం రోజుల నుండి నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, లక్షా డెబ్బై వేల మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో 90,840 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు.