రోజా తీవ్రవాది కంటే డేంజరా..?

Wednesday, January 27th, 2016, 12:10:04 PM IST

YSRCP-ROJA
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసారని చెప్పి సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రోజాను సస్పెండ్ చేయడం అమానుషమని చెప్పి వైకాపా నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఇకపోతే, రోజా ఇటీవలే పాయకరావు ఎమ్మెల్యే అనితపై కొన్ని వ్యాఖ్యలు చేశారట. రోజా వ్యాఖ్యలపై అనిత మండిపడ్డారు. రోజా తీవ్రవాది కంటే కూడా డేంజర్ అని పేర్కొన్నారు. రోజా చేసిన వ్యాఖ్యలపై తనకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తన తప్పు ఉంటే బహిరంగంగా క్షమాపణలు చెప్తానని.. అలాగే రోజా కూడా క్షమాపణలు చెప్పాలని ఆమె పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధికి అడుగడుగా అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షంగా వైకాపా నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయిందని తెలుగుదేశం నేతలు పేర్కొంటున్న సంగతి విదితమే.