భయంతో కాకుండా స్వచ్ఛందంగా ఓటేయాలి – నిమ్మల రామానాయుడు

Tuesday, March 23rd, 2021, 11:20:39 AM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ను తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకం గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్ధి అయిన పనబాక లక్ష్మి మాజీ సి ఎస్ మీడియా ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలతో బలవంతం గా ఓట్లు వేయించుకుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలో భయంతో కాకుండా స్వచ్ఛందంగా ఓటేయాలని నిమ్మల రామానాయుడు అన్నారు. నేటి నుండి తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి అందరికి తెలిసిందే.