బిగ్ న్యూస్: పేదల పేరుతో వైసీపీ నేతలు ఎంత దోచేస్తున్నారో చూడండి!

Tuesday, October 6th, 2020, 01:08:45 AM IST

TDP_1706
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పలు పరిణామాల పై, రాష్ట్ర ప్రభుత్వం తీరు పై తెలుగు దేశం పార్టీ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదిక ద్వారా వరుస ప్రశ్నలు వేస్తున్నారు. అయితే తాజాగా మరొక విషయం పై వరుస ప్రశ్నలు వేస్తూ, ఘాటు విమర్శలు చేయడం జరిగింది. ఇంత అప్పు ఎందుకు అంటే ప్రజల సంక్షేమం కోసం అంటారు, కానీ పేదల పేరుతో వైసీపీ నేతలు ఎంత దోచేస్తునారో చూడండి అంటూ ఒక ఆర్టికల్ ను పోస్ట్ చేశారు.

తెల్ల కార్డ్ పై పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని దేశం దాటించి, 13 రెట్ల లాభానికి అమ్ముకుంటోంది ఒక అవినీతి గ్యాంగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రికి తెలియకుండా లక్షల కేజీలు దారి తప్పడం అసాధ్యం కదా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అంశాల లో వైసీపీ తీరును తప్పుబడుతున్న టీడీపీ, ఇప్పుడు సరికొత్త అంశం తెరపైకి తేవడం తో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.