చంద్రబాబు పై పెరుగుతున్న ఒత్తిడి…ఇలా అయితే ఎలా?

Thursday, November 26th, 2020, 04:15:55 PM IST

తెలుగు దేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. ప్రతి విషయం లో కూడా అధికార పార్టీ నేతలు గత ప్రభుత్వం ను విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఊహించని విధంగా కరోనా వైరస్ మహమ్మారి కారణం చేత చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు ఇద్దరు కూడా తెలంగాణ లోని హైదరాబాద్ కి పరిమితం అయ్యారు. అయితే రాష్ట్రం లో సమస్యలు తలెత్తినప్పుడు నారా లోకేష్, చంద్రబాబు లు ఇద్దరు కూడా ఒకరి తర్వాత మరొకరు పరామర్శించేందుకు , ఓదార్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తూనే ఉన్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉండాల్సింది అంటూ ఆ పార్టీ కి చెందిన నేతలు అంటున్నారు. అంతేకాక చంద్రబాబు ఏపీ లోనే ఉండాలి అంటూ ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు లు ఇద్దరు ఒకరు తర్వాత మరొకరు వస్తుండటంతో ఇలా టీడీపీ అసహనం లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీని పై ఆ నేతలు ఎలా స్పందిస్తారో, చంద్రబాబు నాయుడు ఇంకెన్ని రోజులు వైసీపీ నేతల తో విమర్శల పాలు అవుతారో చూడాలి.