టీడీపీకి నో చెప్తున్న బీజేపీ..అందుకే ఇలా.?

Monday, August 10th, 2020, 12:00:44 AM IST

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి అధోగతిలా ఉందని చెప్పాలి. ఎటు వెళ్లాలనుకున్నా సరే అన్ని దారులు వారికి మూసుకుపోతున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వీరు ఈసారి కొత్త మిత్రులను వెతుక్కునే పనిలో పడ్డారు.

అప్పుడు కాంగ్రెస్ ను తిట్టారు. తర్వాత వారితో దోస్తీ కట్టారు.ఆ తర్వాత బీజేపీని తిట్టారు అలా తిట్టిన బీజేపీ తోనే మళ్లీ కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఏం ప్రయోజనం లేకపోయింది దీనితో బాబు అండ్ కో మళ్లీ బీజేపీపై నిప్పులు కురిపిస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది నేతలు బీజేపీ కు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనితో ఈ ఎఫెక్ట్ అంతా వారు టీడీపీకి నో చెప్పినందుకే అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మాత్రం టీడీపీ వ్యవహారం మరికొన్ని రోజుల్లో ఒక కొలిక్కి వచ్చేసేలా ఉందని చెప్పాలి.