బిగ్‌న్యూస్: ఏపీ మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..!

Monday, September 28th, 2020, 09:12:55 PM IST


ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఉద్దేశిస్తూ మరియు తిరుమల డిక్లరేషన్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి స్థాయిలో ఉండి కొడాలి నాని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పులివర్తి నాని కలిసి మంత్రి కొడాలి నానిపై చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అంతేకాదు కొడాలి నానిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక మొన్న అగరం మంగళం ఆలయంలో జరిగిన నంది విగ్రహం ధ్వంసం సంఘటనలో టీడీపీని ఇరికించాలని పోలీసులు చూస్తే ఊరుకునేది లేదని నేతలు హెచ్చరించారు. ఇకనైనా మంత్రి కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.