కొడాలి నాని తీరు పై విజయవాడ సిపీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

Wednesday, September 9th, 2020, 10:47:01 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైఖరి ను ఎండగడుతూ, వరుస ప్రశ్నలు వేస్తున్న టీడీపీ నేతల పై ఇటీవల కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. అయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యల సబబు కావు అంటూ విజయవాడ సీపీ నీ కలిశారు తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేతలు. వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ మరియు బచ్చుల అర్జునుడు కొడాలి నాని తీరు పై ఫిర్యాదు చేసేందుకు విజయవాడ సిపి ను కలిశారు.

మంత్రి గా ఉన్న కొడాలి నాని వాడుతున్నటువం టి భాష అప్రజాస్వామికం అని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు నాని భాషను చూసి సిగ్గు తో తల దించుకుంటారు అని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా నన్ను కూడా చంపేస్తారా అంటూ అర్జునుడు సూటిగా ప్రశ్నించారు. కొడాలి నాని బూతులు విని ఎవరూ కూడా ఆయన దగ్గరికి రావడం లేదు అని, కొడాలి నాని వ్యాఖ్యల పై చర్యలు తీసుకుంటారెమో అని చూశాం అని, కానీ స్పందించలేదు అని, డీజీపీ బిజీ గా ఉన్నందున విజయవాడ సిపి ను కలిశాం అని అన్నారు. అయితే పోలీసులు తగు చర్యలు తీసుకోకపోతే గవర్నర్ ను కూడా కలుస్తాం అని తెలిపారు.