చిత్తశుద్ది ఉంటే ఆ పని చేయాలి – టీడీపీ

Thursday, December 3rd, 2020, 10:44:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ నేతలు మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ పిరికిపందల వ్యవహరిస్తూ, వ్యవస్తలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ నేతలు తీర్పు స్థాయిలో విరుచుకుపడ్డారు. నమ్మి ఓట్లు వేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ ల పై ఏడాదిన్నర గా దాడులు జరుగుతున్నాయి అని అన్నారు. అయితే వివిధ వర్గాల పై జరుగుతున్న దాడుల విషయం లో మీడియా ను అసెంబ్లీలో కి అనుమతి ఇవ్వనీ విషయం పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లతో నిరసన ర్యాలీ నిర్వహించారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి కి చిత్తశుద్ది ఉంటే ఇకనైనా దాడులు ఆపి అసెంబ్లీ లోకి మీడియా ను అనుమతించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాడుకొని వదిలేయడం ప్రభుత్వానికి అలవాటు అయింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ ను అరికట్టడం లో కీలక పాత్ర పోషించిన వైద్యులకి వ్యతిరేకం గా తీసుకు వచ్చిన 723 జీవో ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, పోరాడితే అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వానికి అలవాటు అయింది అని నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుండి అసెంబ్లీ లో మరియు శాసన మండలి లో టీడీపీ మరియు వైసీపీ నేతల మధ్య మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.