టీడీపీ కార్యాలయంలో జగన్ పుట్టిన రోజు వేడుకలు..!

Tuesday, December 22nd, 2020, 07:26:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యం లో నెల్లూరు జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో కూడా సీఎం జగన్ పుట్టిన రోజు ను జరుపుకున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నేతలు జగన్ పాలనా విధానం ను నిరసిస్తూ ఇసుక తో తయారు చేసిన కేక్ ను కట్ చేశారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన ఆనం వెంకట రామిరెడ్డి మరియు కార్యకర్తలు, పలువురు నేతలు ఇసుక తో తయారు చేసిన కేక్ ను కట్ చేసి నిరసన తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు ను వైసీపీ శ్రేణులు ఎందుకు చేస్తున్నాయో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అధికారం చేపట్టిన అనంతరం నుండి ఇసుక విధానం ను రెండు సార్లు మార్చారు అని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రతి సారి కూడా వెయ్యి రూపాయలు పెంచుతూ పోతున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రస్తుతం ఇసుక యూనిట్ ధర 6500 రూపాయలు గా ఉందని పేర్కొన్నారు. అయితే పెట్రోల్ మరియు డీజిల్ తో సమానం గా ఇసుక రేటు పెరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రం లో సరైన ఇసుక విధానం లేక కోటి మంది ఉపాది కోల్పోయారు అని అన్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరును నిరసన వ్యక్తం చేస్తూ ఇసుక తో కేక్ కట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.