దొంగ ఓట్ల అంశం పై సీఎం జగన్ సమాధానం చెప్పాలి – యనమల రామకృష్ణుడు

Sunday, April 18th, 2021, 05:05:45 PM IST

Yanamala
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో దొంగ ఓట్ల అంశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం పై తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దొంగ ఓట్లు – నోట్లు రాజ్యం గా చేశారు అంటూ అధికార పార్టీ వైసీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దొంగల పాలన లో రాష్ట్రం మొత్తం దొంగల మయం అయ్యింది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. అయితే ఈ దొంగ ఓట్ల అంశం పై సీఎం జగన్ సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే నకిలీ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయం తో జరిగింది కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే పోలింగ్ రోజు దొంగ ఓటర్లతో బస్సులు తిరుపతి కి ఎలా వచ్చాయి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే కేసులు నమోదు అయిన 12 మంది అధికారులు వైసీపీకి చెందిన వారు కాదా అంటూ నిలదీశారు. అయితే నకిలీ ఓట్ల విషయాన్ని కాలవ శ్రీనివాస్ చెప్పినప్పుడే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్ళందరి పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు, వెనక్కి పంపాం అని చెప్పిన ఆ 250 బస్సులు ఎవరివి అంటూ నిలదీశారు యనమల. ఆ బస్సులో వచ్చిన వారు అంతా ఎవరు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే 144 సెక్షన్ విధిస్తే ఫంక్షన్ హాళ్ళలో, రోడ్ల పై వేల మంది ఎలా చేరారు అని ప్రశ్నించారు. అయితే ఓటమి భయం తోనే దొంగ ఓట్లు దొంగ నోట్ల తో జగన్ జిత్తులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ ఫిర్యాదుల పై ఎన్నికల కమిషనర్ వెంటనే స్పందించాలి అని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు ముద్రించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, తిరుపతి అసెంబ్లీ పరిధిలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలి అంటూ యనమల రామకృష్ణుడు అన్నారు. అయితే టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్ లకు అధికార పార్టీ వైసీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.