బిగ్ న్యూస్: జగన్ కేసుల నుండి తప్పించుకోవడానికే ఈ విమర్శలా?

Friday, February 14th, 2020, 03:04:47 PM IST

రాష్ట్రంలో ఐటీ దాడులకు టీడీపీ కి సంబంధం ఏమిటని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామ కృష్ణుడు అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దాదాపు 15 మంది పీఎస్, పీఏ లుగా పని చేసారని యనమల గుర్తు చేసారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేసుల నుండి తప్పించుకోవడానికే టీడీపీ ఫై విమర్శలు చేస్తున్నారని యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే తెలుగుదేశం పార్టీ ఫై ఫిర్యాదుల కోసమే విజయసాయి రెడ్డి కి రాజ్యసభ సీటిచ్చారని ముఖ్యమంత్రి జగన్ ఫై విమర్శలు చేసారు. అంతేకాకుండా ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి గా నియమించింది కూడా అందుకేనని యనమల అన్నారు. జగన్ షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయి రెడ్డి అని యనమల అన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 43 వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుది దశకు చేరిందని యనమల వ్యాఖ్యానించారు. అయితే ఈ అక్రమాస్తుల్ని ఈడీ జప్తు చేసిందని యనమల అన్నారు. ఆ విషయం తెలిసే ట్రయల్స్ అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసారు.