సుప్రీం కోర్టు ఆదేశాలతో సీఎం జగన్ కి భయం పట్టుకుంది – యనమల

Thursday, September 17th, 2020, 09:08:57 PM IST

yanamala ramakrishnudu

ఇటీవల సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం కొందరిని ఆందోళన కి గురి చేస్తోంది. అయితే అవినీతి, ఆర్ధిక నేరాల కేసులను ఆలస్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి భయం పట్టుకుంది అని తెలుగు దేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అంతేకాక దేశం లోని హైకోర్టు ల నుండి ఈ తరహా కేసుల కార్యాచరణ సిద్దం చేయమంది అన్న విషయాన్ని యనమల మరొకసారి గుర్తు చేశారు.

అయితే దేశంలో 4 వేల కేసులు పెండింగ్ లో ఉంటే, అందులో 2500 కేసులు రాజకీయ నేతల వే నని, అందులో 12 ఛార్జ్ షీట్ లు సీబీఐ కోర్టు లో జగన్ పై వేసినవి అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఈ విచారణకు భయపడి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతి పక్ష పార్టీ పై ఆరోపణలు చేస్తున్నారు అని యనమల మండిపడ్డారు. అయితే ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా గత అయిదేళ్ల పాలన పై విచారణ అనడం విడ్డూరం అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అయితే అది చట్టానికి వ్యతిరేకం కాబట్టే స్టే ఇచ్చింది అని స్పష్టం చేశారు.