మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకు ముప్పు తెస్తారా? – యనమల

Sunday, September 6th, 2020, 01:00:52 PM IST

Yanamala

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత, యనమల రామకృష్ణుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైసీపీ తీరు ను తప్పు బడుతూ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాక వరుస ప్రశ్నలు వేస్తూ, అధికార పార్టీ నీ నిలదీస్తున్నారు. అయితే వైసీపీ ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చే రాయితీ కాదు అని యనమల రామకృష్ణుడు అన్నారు. మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకు ముప్పు తెస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అన్నదాతలకు ఇచ్చేది విద్యుత్ రాయితీ కాదు అని, కార్పొరేషన్ కంపెనీ లకు ఇచ్చేది రాయితీ ఎలా అవుతుంది అంటూ నిలదీశారు.

అయితే అధికారం చేపట్టిన తర్వాత నుండి ఏడాది లోనే 4,802 కోట్ల రూపాయల డిస్కం లు ఎగ్గొట్టింది అని తెలిపారు. ఇదే విధంగా అయిదేళ్ల లో 24 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం నాడు మీడియా సమావేశం లో మాట్లాడిన యనమల పలు వరుస ప్రశ్నలు వేశారు. తొలి ఏడాది దిస్కం లను ఎందుకు ఎగ్గొట్టారు అని నిలదీశారు. ప్రభుత్వ ప్రకటనలు సగం సొంత మీడియా కె ఇస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. కేంద్రం కేటాయింపుల కన్నా రెట్టింపు నీటిని సీఎం సొంత కంపెనీ కి కేటాయిస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీ పరిధిలో 25 ఎకరాల భూమి ఉన్నా, లేదంటూ కేంద్రానికి తప్పుడు సమాచారం పంపడం పట్ల యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.