అది నిజమేనా సీఎం గారూ.. జగన్‌కి వర్ల రామయ్య సూటి ప్రశ్న..!

Thursday, October 22nd, 2020, 04:35:24 PM IST

ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా ఓ సూటి ప్రశ్న వేశారు. హై టెక్నాలజీ ఉపయోగించి మెడికల్ పీజీ ఫైనల్ పరీక్షలలో కాపీ కొట్టి, దొరికిన ఆ కేటుగాడు ఎవరంటూ నిలదీశారు. ఆ కేటుగాని తండ్రి అధికార పార్టీకి చెందని ఎమ్మెల్యే అట అని, అందుకే ఆ కాపీ రాయుడిపై చర్యలే లేవని అన్నారు. మెడికల్ యూనివర్సిటీ అంతా అతడిపై చర్యలు తీసుకోవడానికే భయపడుతున్నారట అని చెప్పుకొచారు. అయితే ఇదంతా నిజమేనా ముఖ్యమంత్రి గారు అని వర్ల రామయ్య జగన్‌ని ప్రశ్నించారు.