అది అన్యాయం.. సీఎం జగన్‌కు వర్ల రామయ్య బహిరంగ లేఖ..!

Wednesday, September 16th, 2020, 12:20:12 PM IST

varla-ramaiah-jagan

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. రోజు రోజుకు రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని వాటి గురుంచి మిగతా పత్రికల్లో వస్తున్నా, సాక్షి పత్రికలో దళిత వార్తలను నిషేదించినట్టుగ్గా కనిపిస్తుందని అన్నారు. దళిత వర్గాల ప్రజలు చెల్లించిన పన్నుల ఖాతా నుండి సాక్షి పత్రికకు పత్రికా ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తన్నప్పుడు దళితుల దాడుల గురుంచి రాయకపోవడం నిజంగా అన్యాయమని అన్నారు.

అయితే ఎందుకు సాక్షి పత్రికలో దళితులపై జరుగుతున్న దాడుల గురుంచి రాయడం లేదో సమాధానం చెప్పాలని కోరారు. దళితుల డబ్బుతో సాక్షి పత్రికకు కోట్లాది రూపాయలు పన్ను చెల్లిస్తున్నప్పుడు, దళితుల వార్తలు రాయకపోవడం నిజంగా దళిత వర్గాలను కించపరచడమే అని అన్నారు. దళిత వార్తలు ప్రచురించకుండా దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న సాక్షి పత్రికకు ప్రకటనలు నిలిపివేయాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియలో ఏ పత్రిక అయిన నమోదు చేసుకునేటప్పుడు ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ప్రజలకు వార్తలు అందిస్తామని ప్రమాణం చేస్తారని గుర్తుచేశారు.