చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలి.. వర్ల రామయ్య డిమాండ్..!

Saturday, March 20th, 2021, 12:57:36 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఆతృత సరైంది కాదని హైకోర్టు నేడు మరోమారు స్పష్టం చేసిందని, జగన్‌కు ఏ మాత్రం నైతిక విలువలున్నా చంద్రబాబుకు క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. తప్పుడు కేసులు పెట్టడం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అలవాటేనని వర్ల రామయ్య మండిపడ్డారు.

ఇదిలా ఉంటే అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై జరుగుతున్న సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అయితే విచారణ తొలిదశలో వివరాలు చెప్పలేమని సీఐడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ కోర్టుకు తెలిపింది.