ఏపీలో రౌడీ ప్రభుత్వం రాజ్యమేలుతుంది – వర్ల రామయ్య

Friday, November 13th, 2020, 01:06:36 AM IST


ఏపీలో రౌడీ రాజ్యం రాజ్యమేలుతుందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబంతో సహా కలిసి పాణ్యం మండలం కౌలూరు వద్ద గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని అయితే పోలీసుల వేదింపులు దానికి కారణమని అన్నారు. మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే సీఎం జగన్ కనీసం స్పందించలేదని మండిపడ్డారు.

అయితే ఈ కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వ కుట్రలు చేస్తుందని వర్లరామయ్య ఆరోపించారు. డీఎస్పీ, ఎస్పీలను కూడా విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని హితవుపలికారు. డీజీపీ సవాంగ్‌ పోలీస్‌ వ్యవస్థను సరిగా నడపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.