సీఎం జగన్ పై మండిపడుతున్న టీడీపీ నేత – మాట తప్పడమే ఆయనకు అలవాటు…

Friday, February 14th, 2020, 12:02:55 AM IST

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ పార్టీ కీలక నేత బోండా ఉమా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రాజ్యాధికారం కోసం ప్రజలందరినీ మభ్యపెట్టి మాట్లాడుతూ… తనకు మాట తప్పడం, మడిమ తిప్పడం లాంటి అలవాట్లు లేవని, నిజాయితీగానే తన పరిధిలోని, తనకి సంబందించిన పనులన్నీ కూడా నిబద్దతతో పూర్తి చేస్తానని చెప్పిన సీఎం జగన్, రాష్ట్రంలో అధికారం రాగానే మాట మారుస్తూ, ప్రజలందరినీ కుడి అమోసం చేస్తున్నారని టీడీపీ పార్టీ కీలక నేత బోండా ఉమా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన టీడీపీ నేత బోండా ఉమా మాట్లాడుతూ… ”రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధానిగా అమరావతి ఏర్పాటు, అభివృద్ధి, వివేకా హత్య కేసు విచారణ, 45 ఏళ్లకే పింఛన్లు, అమ్మఒడి పథక హామీలపై సీఎం జగన్ ఇప్పటికే మాట తప్పారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో తమ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానని మాటిచ్చిన జగన్, నేడు ప్రధాని మోడీ ముందు మెడలు వంచారని, విశాఖలోని తన భూములను అమ్ముకోడానికే ఇలా రాజధానిని విశాఖకు తరలించారని” బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.