100 వస్తే.. తోడగోట్టిన రేవంత్

Wednesday, January 13th, 2016, 02:35:54 PM IST

reddy
గ్రేటర్ ఎన్నికలు ఓ రేంజ్ లో రాజుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకూ మామూలుగానే ఉన్న రాజకీయ వాతావరణం రెండు మూడు రోజుల్లోనే వేడెక్కిపోయింది. నిన్న హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన టీడీపీ ఎన్నికల శంఖారావంలో టీడీపీ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీని దుయ్యబట్టి.. తొడలు కొట్టి ఛాలెంజులు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఈసారి గ్రేటరెన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమి విజయం ఖాయం అంటే.. టీడీపీ తెలంగాణా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పటిలాగే తమ దూకుడు చూపించారు.

సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. హైదరాబాద్ పై 60, 000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే అది చంద్రబాబు కృషే. కానీ కేటీఆర్ అదంతా తమ గొప్పతనమే అన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీ కవిత కేసీఆర్ భోళా శంకరుడని అన్నారు. ఆయన కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే భోళా శంకరుడు. చంద్రబాబు హైదరాబాద్ గురుంచి పట్టించుకోవటం లేదన్నారు. కానీ ఈ సభలో జనాన్ని చూసి ఆ మాట చెప్పండి. కేటీఆర్ అన్నట్టు గ్రేటర్లో టీఆర్ఎస్ 100 స్థానాలను గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. ఇంకా కేటీఆర్ కోరితే తెలంగాణాలో అడుగు కూడా పెట్టను’ అంటూ సవాల్ చేశారు. దీనికి కొద్ది రోజుల క్రితమే కేటీఆర్ కూడా తాము 100 స్థానాలు గెలుస్తామంటూ.. లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.