బిగ్ న్యూస్: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బిటెక్ రవి!

Saturday, August 1st, 2020, 02:14:46 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మూడు రాజధానుల వ్యవహారం పై హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. ప్రతి పక్ష పార్టీ నేతలు అధికార పార్టీ పై వరుస గా ఘాటు విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు మూడు రాజధానుల నిర్ణయం, సి ఆర్ డి ఎ రద్దు బిల్లు ల పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల టీడీపీ నేతలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నేత ఎమ్మెల్సీ బిటెక్ రవి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.

అయితే బీ టెక్ రవి రాజీనామా చేయడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది. అయితే రాజీనామా కి గల కారణాలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి రాసిన లేఖ లో వివరించారు. పైన వివరించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం అప్రజాస్వామికం అని అభిప్రాయ పడ్డారు. అంతేకాక గవర్నర్ చర్యను రాజ్యాంగ వ్యతిరేక చర్య గా భావిస్తున్నట్లు లేఖ లో పేర్కొన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టాలు సైతం నేటికీ రాష్ట్రనికి దక్కలేదు అని, అంతేకాక అసలు ప్రాధాన్యత లేని శాసన మండలి లో ఉండటం అనవసరం అని భావిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు.